ఏఎస్సై సాంబశివరావును సన్మానించిన సర్పంచ్ సీతారామిరెడ్డి..

Published: Thursday January 12, 2023
తల్లాడ, జనవరి 11 (ప్రజాపాలన న్యూస
  *తల్లాడ  పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పదోన్నతి పొందిన సాంబశివరావును మండలంలోని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి సన్మానించారు. బుధవారం తల్లాడలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయనను శాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఆయనతోపాటు తల్లాడ ఎస్సై పి. సురేష్ కు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామస్తులు బండి బాలశౌరి, ప్రభాకర్, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.*