బిల్లుపాడులో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.. తల్లాడ, సెప్టెంబర్ 29 (ప్రజా పాలన న్యూస్):

Published: Friday September 30, 2022
తల్లాడ మండలంలో బిల్లుపాడు గ్రామంలో బుధవారం రాత్రి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ జక్కంపూడి ప్రేమలత, ఉపసర్పంచ్ సామినేని రాణి దగ్గరుండి వీక్షించారు. అదేవిధంగా వారు మహిళలతో కలిసి కోలాటం ఆడి నృత్యాలు చేశారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం 11 రోజులపాటు వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 
ఈ కార్యక్రమంలో సామినేని రామ అప్పారావు, జక్కంపూడి రమేష్, వార్డు సభ్యులు మట్టా రాములు, బెగ్ అలీ బాబు, సీతారాములు, ఇంజం వెంకటయ్య, అల్లడి నాగేశ్వరరావు, ఎస్.కె గపూర్,  నారపోగు వెంకటేష్, యలమర్తి సురేష్,  మహిళలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.