పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి : అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ

Published: Friday December 17, 2021
మధిర డిసెంబరు 16 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండల దెందుకూరు గ్రామంపిల్లలను దత్తత తీసుకునే వారు చట్టబద్ధంగా తీసుకోవాలని మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ పేర్కొన్నారు. గురువారం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జిల్లా శిశు సంక్షేమ మరియు దివ్యాంగుల, వయోవృద్ధులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చట్టబద్దమైన దత్తతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేని  తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక దత్తత సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకొని వారి ద్వారానే చట్టబద్దంగా పిల్లలను దత్తత తీసుకోవాలని ఆమె కోరారు. దీని వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆమె అన్నారు. ఎవరైనా అక్రమంగా దత్తతు తీసుకుంటే చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ కుడుముల విజయభాస్కర్ రెడ్డి దెందుకూరు వైద్యులు శశిధర్ అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, వైద్య సిబ్బంది సోషల్ వర్కర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు