జీవితాంతం పేదలకు అండగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ నోముల రామ్ రెడ్డి

Published: Tuesday July 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నిరంతరం పేదల కోసం పని చేసిన గొప్ప నాయకుడు నోముల రామ్ రెడ్డి అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ అన్నారు. మండల పరిధిలోని సంగేo గ్రామంలో నోముల రామి రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా స్థూపానికి నివాళ్ళుఅర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ అమరజీవి కందాల రంగారెడ్డి నాయకత్వంలో రామిరెడ్డి సంఘం, వర్కట్పల్లి గోకారం గ్రామాల్లో నిరంతరం పేద ప్రజల కోసం నాటి భూస్వాములు చేస్తున్న ఆగడాలను అరికట్టడం కోసం దోపిడీ విధానాల్ని తిప్పికొట్టడం కోసం నిరంతరం కృషి చేశాడన్నారు.అనేక మంది పేదలకు ప్రభుత్వ భూములను పంచి భూమిలేనిపేదల గుండెల్లో రామ్ రెడ్డి గారు నిలిచారని అన్నారు. దోపిడీ లేని సమాజం కోసం రామ్ రెడ్డి నిరంతరం కృషి చేశాడన్నారు. అదేవిధంగా అనేక వృత్తిదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వారికి అండగా నిలిచిన వ్యక్తి రామ్ రెడ్డి ఆని అన్నారు. తన చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను తన జీవితాంతం మోస్తూ తన చివరి శ్వాస వరకు ఎర్రజెండా నాయకత్వంలో పని చేసిన గొప్ప వ్యక్తి రామ్ రెడ్డి గారని ఆయన అన్నారు.ఈనాడు రాజకీయాల్లో పదవిపై వ్యామోహం డబ్బుపై వ్యామోహం పెరిగి రోజుకొక పార్టీలు మారుతున్న నాయకత్వం తయారైందన్నారు. అందుకే ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే వామపక్ష భావజాలం మరింత పెరగాల్సి ఉందన్నారు. అందుకే కమ్యూనిస్టులు యొక్క అవసరం ఈ రాష్ట్రంలో దేశంలో ఉందని కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలని ఆయన అన్నారు. తన జీవితాంతం సిపిఎం నాయకునిగా బ్రతికిన రామ్ రెడ్డి ఆదర్శం నేటి యువతకు సమాజానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి,వలిగొండ సింగిల్విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి,స్థానిక సర్పంచ్ కీసరి రామ్ రెడ్డి, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్, సిపిఎం శాఖ కార్యదర్శి భీమనబోయిన జంగయ్య,సీనియర్ నాయకులు, ఏనుగు సాయి రెడ్డి, రామ్ రెడ్డి కుమారుడు నోముల జంగారెడ్డి, మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ, నాయకులు వరికుప్పల మల్లేశం, సిపిఎంనాయకులు ఆంగిటి దేవేందర్ రెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి, కవిడే సురేష్, ఏనుగు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.