డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనర్యాలీ

Published: Monday February 14, 2022
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి 13, ప్రజాపాలన : రామకృష్ణపూర్ పట్టణంలో రైట్ టు హెల్త్ ఫోరమ్ (ఆర్ టీ హెచ్ ఎఫ్) ఆధ్వర్యంలో డ్రగ్స్ దుర్వినియోగం పై ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఫోరమ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలుగా మారి, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నా రని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో విద్యార్థులే ఎక్కువగా నేరస్తులుగా ఉంటున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువతడబ్బుల కొరకు నేరాలకు పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్కు బానిసై ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఫోక్సో కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వైపు యువత ఆకర్షితులై బానిసలుగా మారవద్దని, లక్ష్య సాధన కొరకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నందిపాటి రాజు, పట్టణ నాయకులు రామగిరి శేఖర్ లింగంపల్లి శ్రీనివాస్, మోతె రవి, అజయ్, సందీప్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.