బాల్య వివాహాల నివారణకై చైతన్య సదస్సు

Published: Friday February 11, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 11 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో బాల్య వివాహాల నివారణకై ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకా పూర్ రైతు వేదికలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణ పై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పి (అడ్మిన్) వై వి ఎస్ సుధీంద్ర తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణకై ప్రజా చైతన్య సదస్సులు ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో బాల్యవివాహాల నివారణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుటుంబాలలో ఆడపిల్ల వివాహం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలిపారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు, వివాహానికి హాజరైన వారు, నిర్వాహకులు అందరూ శిక్షార్హులే అని తెలిపారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, సఖి నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.