విద్యుత్ శాఖ ఎర్రుపాలెం

Published: Saturday April 15, 2023

సెక్షన్ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ గా జి. అనూష మధిర ఏప్రిల్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖసబ్ డివిజన్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇదే సబ్ డివిజన్ పరిధిలో సబ్ ఇంజనీర్ గా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి, అసిస్టెంట్ ఇంజనీర్ గా పదోన్నతి పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సెక్షన్ లో విధులు నిర్వర్తించి, బదిలీపై ఎర్రుపాలెం సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. అనూషను మధిర సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎం. అనురాధ అభినందించారు. అదేవిధంగా మధిర పట్టణ మరియు ఎర్రుపాలెం సెక్షన్ సబ్ ఇంజనీర్లు ప్రవీణ్, చీనా మధిర పట్టణ ఫోర్ మెన్ రఘు, సబ్ డివిజన్ శ్రీధర్ తదితరులు అభినందించారు.