గంగ పుత్రులను సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసితులుగా గుర్తించాలి

Published: Tuesday November 22, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 21, ప్రజాపాలన:
గంగ పుత్రులను సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసితులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గంగ పుత్ర సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ మత్స్య శాఖ కమీషనర్ కు సోమవారం రోజున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెన్నెల నర్సయ్య మాట్లాడుతూ నస్పూర్ మండలం లోని సింగపూర్  చెరువు ను సింగరేణి వారు ఓపెన్ కాస్ట్ మైన్ కొరకు తీసుకొని చెరువు కు గండి కొట్టి నీళ్లు లేకుండా చేసినందువల్ల చెరువు పై ఆధారపడిన 49 కుటుంబం వారు శాశ్వతం గా జీవనోపాదిని కోల్పోయి నందున వారిని నిర్వాసితులాగా గుర్తించి, నష్టపరిహారం చెల్లించి, జీవన ఉపాధి కల్పించాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, మానేం కుమార్, ఇండ్ల మధు, జంబోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.