గోవిందపురం ఎల్ గ్రామంలో ఎల్ఐసి వారి సహకారంతో బోర్లు ఏర్పాటు

Published: Thursday September 23, 2021
బోనకల్, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామంలో మధిర ఎల్ఐసి  బ్రాంచ్ వారి సహాయ సహకారంతో ఎల్ఐసి గ్రామ ఏజెంట్ పసుపులేటి వెంకట్ సహకారంతో సర్పంచ్ ఉమ్మినేని బాబు ఆధ్వర్యంలో బుధవారం రెండు బోర్లు సుమారు లక్ష రూపాయల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో గోవిందపురం (ఎల్) గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద, ముస్లింల స్మశాన వాటిక వద్ద బోర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమ్మినేని బాబు ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, కళ్యాణపు నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి నరసింహారావు, ఉమ్మినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.