ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి

Published: Thursday April 22, 2021

బాలపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : దేశంలోనే తెలంగాణ రాష్ట్ర లో ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచర్స్ కు రెండు వేల తొమ్మిది వందల (2900) మెట్రిక్ టన్నుల సన్న బియ్యంనీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం చేయడం జరిగిందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో 17వ డివిజన్ లో ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి రేషన్ షాప్ (1599004)లో ప్రైవేట్ స్కూల్ లలో పని చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు 25 కిలోలు సన్నబియ్యం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బాలాపూర్ మండలంలో దాదాపు 1752 ఉపాధ్యాయులకు, ప్రైవేట్ స్కూల్ లలో పనిచేసే టీచర్స్ రాష్ట్ర ప్రభుత్వం 25 కిలోలు సన్న బియ్యం ఇస్తూ, 2000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి వైరస్ నేపద్యంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు జీవనోపాధి లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆలోచించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, వారికి సాయం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర మొత్తము 2900 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తో పాటు ఉపాధ్యాయులకు రెండు లక్షల 12 వేల మందికి, 2000 చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. ఇంకా కొంత మంది ఉపాధ్యాయులకు రాని ఎడల వారిని స్వీకరించి అందరికి వచ్చేటట్లు చేస్తారని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మన సీఎం కేసీఆర్ తీసుకోవడం అంటే నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడంలో ఆయనకు సాటి లేరు అని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి ఉపాధ్యాయులు ఎన్నో  ప్రభుత్వాల పరిపాలన లో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని ఇలా ఇవ్వడంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అని మనస్ఫూర్తిగా కరోనా మహమ్మారి నుండి తొందరగా కోలుకోవాలని తెలంగాణ యావత్ ప్రజల కోరుకుంటూ టీచర్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎమ్ ఆర్ ఓ శ్రీనివాస్ రెడ్డి, బాలపూర్ మండల సిబ్బంది, మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ లార్డ్స్ స్కూల్ కరస్పాండెంట్ సిద్ధల చిన్న బీరప్ప, బడంగ్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు భీమిడి సప్న జంగారెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్, బండారి మనోహర్, బాలు నాయక్, కంటెస్టెంట్ కార్పొరేటర్ లక్ష్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రఘునందన్ చారి, ఖలీల్, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, అభిమానులు కార్యకర్తలు యువకులు పెద్దలు పాల్గొన్నారు.