ఉపాధి హామీ చట్టం లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అదునాతన సాఫ్ట్వేర్ వలన ఉపాధి కూలీలాకు*

Published: Tuesday October 18, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి ఈసందర్బంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ

పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది . కేంద్ర ప్రభుత్వం.ప్రభుత్వ రంగా సంస్థలాన్ని కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్పు తున్న కారణంగా కార్మికులు రోడ్డున పడుతున్నారు పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కుతున్నారు అలాగే కొట్లాడి పేదలకు ఆకలితిరుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని వదలకుండా ఇందులో అదునాతన సాఫ్ట్ వేర్ కొత్తవిధానాలు తెచ్చిన వంకతో ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుంది. ఈ విధానాల వలన కూలీలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఉంది ప్రభుత్వ తీరు

1. కూలీలు ఉదయం సాయంత్రం పనులకు హాజరు కావాలని. రెండు పూటలు ఫోటోలు ఉదయం మధ్యాహ్నం ఫోటోలు తీసి అప్ లోడు చేయాలనీ నిబంధన పెట్టడం తో క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ సరిగ్గా రాక ఫోటోలు అప్లోడ్ కాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ఈ పద్ధతి కూలీలకు అటు సిబ్బందికి ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది.ఉపాధి పనిలో రైతులకు కల్లాలను నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం దీన్ని తొలగించింది

2. గతంలో గ్రామాలలాల్లో ఎన్ని పనులైన చేసేవారు. ఇందులో వృద్దులు వికలాంగులు పని చేసే వారు కేంద్రం ప్రభుత్వం తెచ్చిన మార్పు వలన వీరు రోడ్డున పడతారు ఇప్పుడు చేపడుతున్న పనులు ఒక్కటి పూర్తి ఐతేనే మరో పని చేయాలనే నిబంధన ఈ పద్ధతి వలన పనుల్లో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది కావునా కేంద్ర ప్రభుత్వం అధునాతన సాఫ్ట్వేర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొన సాగించాలి లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము ఆయన తెలిపారు.