మధిర ప్రాంతప్రజల కు నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోము : సిపిఐ రవి

Published: Thursday August 19, 2021
మధిర, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో అత్యవసర సేవలందిస్తున్న 108 వాహనం ను ఎర్రుపాలెం కు తరలించినట్లుగా మాదృష్టికి వచ్చిందని ఇది మధిర పట్ల ఇక్కడి ప్రజలపట్ల ప్రజాప్రతినిధులకు ఎంత భాద్యత ఉందొ అర్ధమవుతుందని బెజవాడ రవి విమర్శించారు. ఒకప్రాంతానికి అవసరం ఉంటే మీకు పలుకుబడి ఉంటే ఎర్రుపాలెం కు వేరొక వాహనాన్నిస్తే హర్షించేవారం. కానీ మధిరలోని 108 వాహనాన్ని గుట్టు చప్పుడు కాకుండా వేరొక వాహనాన్ని ఇవ్వకుండా ఎర్రుపాలెం కు తరలించడం మధిర ప్రాంతానికి అన్యాయం చేసినట్లుగా భావిస్తున్నాం. సిపిఐ ఆధ్వర్యంలో నామా నాగేశ్వరావు గారు ఇచ్చిన అంబులెన్సు ను వినియోగంలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మోరపెట్టుకున్నా దానిని వినియోగంలోకి తేవడం చేతకాని వాళ్ళు గత దశాబ్దకాలంగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న 108 వాహనాన్ని ఎరుపాలెం కు ఏ ప్రాతిపదికన తరలించారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మధిరకు 108 వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజలను కలసివచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనలకు పిలుపునిస్తామని, మధిరకు ఈ ప్రాంత ప్రజలకు ఏవిధంగా నష్టం జరిగినా సిపిఐ చూస్తూ ఊరుకోదని అధికారులను హెచ్చరించారు.