వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలి : దోమ సర్పంచ్ రాజిరెడ్డి

Published: Wednesday April 28, 2021

పరిగి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, వ్యాపారులు జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలనీ దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి అన్నారు. మంగళవారం దోమ పంచాయతీలో కరోనా కట్టడి విషయంపై పలు రకాల వ్యాపారస్తులతో నిర్వహించిన సమావేశంలో మహమ్మారి కరొన కట్టడికి చర్యలు తీసుకునే విషయంలో జరిగిన చర్చలో వ్యాపారస్తులు కొందరు సమయం పెడితే ఒకే సారి దుకాణాల దగ్గర గుంపులు గుంపులుగా వొస్తారని, జనానికికొన్ని సమయల్లో అవసరం ఉన్న వస్తువులకు వొచ్చి ఇవ్వాలని కచ్చిత్తంగా అడగడంతో కాదన లేకపోతమని అందుకు పంచాయతీ నిర్ణయం తీసుకోవాలని.దుకాణాలకు తాడు కట్టి శానిటేషన్ పెడతామణి దుకాణాల ముందు సామజిక దూరం పాటించేలా చర్యలు తీస్కుంటూ బయట గ్రామాల వారు వొచినప్పుడు మరింత జాగ్రత పడతామణి దుకాణ దారులు పేర్కొనగా.అన్ని జాగ్రత్తలు తీసుకోని వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సర్పంచ్ రాజిరెడ్డి కోరారు. ముక్యంగా హోటల్ వాళ్ళు కూర్చో పెట్టుకోరాడని చెప్పారు. మంగళవారం జరిగే సంతలో సామజిక దూరం పాటించేలా కూరగాయల వారికీ అవగాహన కల్పించాలని, పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ రాజిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోషీ, సభ్యులు లక్ష్మణ్, రమేష్, లావణ్య, వసంత రావు, మైను, నవీన్ కుమార్. సాయి, వ్యాపారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.