రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ని గ్రామ కంఠం భూమి అక్రమ నిర్మాణల

Published: Saturday July 23, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధిగత కొంతకాలంగా మేడిపల్లి నక్కర్త గ్రామంలో అక్రమా నిర్మాణాలను ఆపి వేయాలంటూ ఇల్లు లేని పేద ప్రజలు ప్రతిపక్షలు నినదిస్తున్నాయి అధికారులకు,దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు...ఎట్టకేలకు హై కోర్ట్ స్టే ఇవ్వడంతో తో మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు, సంతోషం వ్యక్తం చేశారు.హై కోర్టు స్టే ఇచ్చిన పత్రని గ్రామ సెక్రటరీకి గ్రామ ప్రజలు, అందజేసి అక్రమా నిర్మాణాలు ఆపివేయాలంటూ డిమాండ్ చేశారు. నక్కర్త మేడిపల్లి గ్రామంలోని నక్కర్త గ్రామ కంఠం భూమిలో అధికారుల, నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని.గ్రామ కంఠం భూమిలో అక్రమ వెంచర్లు వేసి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంది అని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల సర్వే అధికారి సర్వే పూర్తి చేసి గ్రామా కంఠం భూమి అని తేల్చి హద్దు రాళ్లు పాతిన.యేచ్చతగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటూ గ్రామ ప్రజాలో ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటున్నాయి..గ్రామ సెక్రటరీ కి మండల అధికారులకు చెప్పిన ఫలితం శూన్యం అంటూ..ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ ప్రజల అవేదన.. వ్యక్తం చేస్తున్నారు..ఈ గ్రామ కంఠం భూమి పై పదుల సంఖ్యలో అధికారుల దృష్టికి తీసుకపోయి, పిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నరూ అంటున్న గ్రామ ప్రజాలు. అధికారుల, నాయకుల అండ దండలు ఉంటే ఏదైన సాధ్యమేనా ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చా..? అంటూ గ్రామ ప్రజలు.అసహనం వ్యక్తం చేస్తున్నారు...ప్రభుత్వ, గ్రామ కంఠం భూమిని అక్రమార్కుల నుండి కాపాడాలి అని, ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ కంఠం భూమి ఉపోయోగించాలి అని ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు కట్టించాలి అని గ్రామ ప్రతిపక్ష నేతలు, గ్రామ ప్రజలు,డిమాండ్ చేస్తున్నారు.