ఘనంగా బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Saturday March 11, 2023
మేడిపల్లి, మార్చి 10 (ప్రజాపాలన ప్రతినిధి)
అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం ఇన్చార్జి డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి అరుణ, కూతురు నాగలక్ష్మి రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి లు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్, మురళి రెడ్డి, మేడి పాపన్న , రోహిత్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు.