దోమల నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే

Published: Thursday August 26, 2021
బోనకల్లు, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో దోమల నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే చేస్తూ దోమల స్థావరాలను వాటి పునాదులను ఆశ అంగన్వాడీలు అటక మీద ఉన్న దోమల స్థావరాలను వెలికితీస్తూ రాత్రి పూటా కూడా ఇంటింట సర్వే చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు లేకుండా చేయాలని జ్వర పిడితులను గుర్తిస్తూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి యొక్క శక్తి సామర్ధ్యాలను దోమల నివారణ లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దోమలపై నిఘా పెట్టి సర్వే చేస్తున్నటువంటి టీం కు సర్పంచ్ మర్రి తిరుపతిరావు అభినందనలు తెలియజేశారు ఈ విధంగా దోమల స్థావరాలను గ్రామ ప్రజలంతా లేకుండా చేయగలిగితే డెంగ్యూ అంతం చేయవచ్చని ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు రత్నకుమారి కళావతి అంగన్వాడి టీచర్లు పద్మ హుస్సేన్ బి గౌరమ్మ నాగరాజు పాల్గొన్నారు.