బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి : ఏ ఐ టీ యూ సీ జిల్లా నాయకులు బెజవాడ రవి.

Published: Tuesday March 16, 2021
మధిర, మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ రంగం లోని బ్యాంక్ లను ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పజెపుతున్న కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు రేపు EFBU ఆధ్వర్యంలో జరుగుతున్న దేశ వ్యాప్త బ్యాంక్ ల సమ్మెకు ఏ ఐ టీ యూ సీ పూర్తిగా సంఘీభావం తెలుపుతుందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రభుత్వారంగం లోని ప్రశ్రమలు, బ్యాంక్ లు, LIC, రైల్వేలు, సింగరేణి బొగ్గుగనులు, ఇలా ప్రతి దానిని ప్రయివేటు వ్యక్తుల ప్రయోజనం తో పాటు వారి ఆర్ధిక ప్రయోజనం కోసం అంగడి సరుకులు అమ్మినంత ఈజీ గా అమ్మజూస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కనీసం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా లభించిన రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేవి కానీ, మనువాద మత్తులో కురుకుపోయిన కేంద్రంలోని మోడీ ప్రభత్వం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే విధంగా ప్రభుత్వ రంగాన్ని పప్పు బెల్లాల వలే అమ్మేందుకు దుర్మార్గపు ప్రయత్నలు చేస్తున్నారు, భవిష్యత్ లో ఉద్యోగ భద్రత అనేది ఉండదని ప్రజలు కూడా గమనించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బ్యాంక్ ఉద్యోగులకు అన్నివర్గాల ప్రజలు మద్దతుగా వుండాలని బెజవాడ రవి పిలుపునిచ్చారు.