నేటి మొక్క - రేపటి ప్రాణ వాయువు మంచిర్యాల బ్యూరో, జూలై9, ప్రజాపాలన:

Published: Tuesday July 12, 2022

నేడు నాటిన మొక్క రేపటి తరానికి ప్రాణవాయువు అవుతుందని అడ్వకేట్, సిపిఐ రామకృష్ణాపూర్ పట్టణ కౌన్సిల్ సభ్యుడు రాజలింగు మోతె అన్నారు. సోమవారం జోడు పంపుల ఏరియాలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు మనం నాటిన మొక్క రేపటి ప్రాణవాయువు గా, వృద్ధాప్యంలో ఉతకర్ర గా, మరణానంతరం కొయ్యగా మారి మరణశయ్య అవుతుందన్నారు. భూమిపై ఉన్న మానవులందరికీ ఆరు నెలలకు సరిపడా ఆక్సిజన్ సృష్టించడానికి 2660 లక్షల కోట్ల రూపాయలుఖర్చు అవుతాయని, కానీ, చెట్లు మనకు ఉచితంగా ఆక్సిజన్ ను  ఇస్తాయాన్నారు. ఒక చిన్న వైరస్ ముఖానికి మాస్క్ పెట్టుకునేలా చేసిందని, మొక్కలు పెంచకపోతే భవిష్యత్తులో వీపుకు సిలిండర్ ను కట్టుకోవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు మంతెన లత, ఓరగంటి రాజేశ్వరి, ఉప్పుల లచ్చమ్మ, వాసాల దుర్గమ్మ, కారుకూరి విజయ, మంతెన వరుణ్, సాగర్,మనీషా,నందిని తదితరులు పాల్గొన్నారు.