జగిత్యాల జనసేన నియోజకవర్గ ఇంచార్జి గా బెక్కం జనార్థన్

Published: Tuesday December 13, 2022

జగిత్యాల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): జనసేన జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జిగా జగిత్యాల గాంధీనగర్ కు చెందిన బెక్కం జనార్థన్ ను నియమిస్తూ ఆదివారం జనసేన  పార్టీ ఇంఛార్జి  నేమూరి శంకర్ గౌడ్  ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ బాధ్యులను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 32 నియోజకవర్గాల కార్య నిర్వహకులను నియమించారు. తన నియమానికి కృషి చేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యణ్ కి మరియు రాష్ట్ర ప్రతినిధులకు బెక్కం జనార్థన్ కృతజ్ఞతలు తెలియజేశారు. జగిత్యాలలో జనసేన బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని జనసేన పార్టీ విధి విధానాలను ప్రజల్లో మమేకమై జనసేన పార్టీ బలోపేతానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని చెప్పారు. నా ఈ నియామకానికి జనసేన పార్టీ పెద్దలతో పాటు జనసేన జగిత్యాల జనసైనికులకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.