పశుసంవర్ధక శాఖ అధికారులను నిలదీసిన సంఘాల ప్రతినిధులు

Published: Friday July 29, 2022
పాలేరు జులై 28 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పై నిర్వహించిన అవగాహన సదస్సు లో పశు సంవర్ధక శాఖ అధికారులను సంఘాల ప్రతినిధులు నిలదీశారు. తొలుత వెటర్నరీ సంయుక్త సంచాలకులు వేణుమనోహర్ పథకం యొక్క ఉద్ధేశ్యం, లక్ష్యాలను వివరించారు. ఈ క్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నాయకులు, వివిధ గ్రామాల సోసైటీ సిద్ధంగానే ఉన్నాం. కానీ యూనిట్లు ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్పగలరా అని గువ్వలగూడెం కు చెందిన మారుతి కొండలరావు. ప్రశ్నించారు. వేలాది రూపాయాలు అందినకాడికల్లా అప్పులు తెచ్చి
సంఘాల ప్రతినిధులు పలు విషయాల పై అధికారులు ను నిలదీశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కి సభ్యుల వాటాధనం ను చెల్లించటానికి
డీ.డీ.లు తీస్తే ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సంవత్సరాలు తరబడి జాప్యం వలన సభ్యులు అప్పులపాలైతున్నారని అనాసాగారం కు చెందిన సంఘం ప్రతినిధి యడ్ల తిరపరావు అగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ సభ్యుడు కు యూనిట్ ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లగా యూనిట్ గొర్రెలు చనిపోతే భీమా అందించటం లేదని, ఇదేనా పథకం ఉద్దేశ్యమని సంఘం నాయకులు మీగడ గోపి ఆవేదన వ్యక్తం చేశారు. నామిని కి కూడ పధకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని చెరువుమాధారం చైర్మన్ పరిటాల వలరాజు కోరారు. సభ్యులు అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా జెడీ మాట్లాడుతూ పధకం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో డీ.డీ.లు తీయాలని సూచించారు. జిల్లాలో 17,400 మందికి రెండో విడత యూనిట్లు. పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనిట్ రూ.1,75,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో రైతుల వాటాధనం రూ.43.750. ప్రభుత్వం వాటాధనం రూ.1.31.250 చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ మల్లేబోయిన శ్రీనివాసరావు, సర్పంచ్ ఈవూరి సుజాత. సోసైటీ చైర్మన్ పగిడిపత్తి శ్రీను. వెటర్నరీ వైద్యాధికారి బి.రాజు, సంఘం ప్రతినిధులు పరిటాల వలరాజు, వాకదాని నాగేశ్వరరావు, ఆవుల వెంకయ్య. వెనికె నరసింహారావు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.