ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలి

Published: Tuesday July 13, 2021
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి

టిపిసిసి నూతన సారథి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలోపేతం

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జూలై 12 ప్రజాపాలన బ్యూరో : టిఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి దర్గా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎడ్ల బండ్లు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిన టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు అందని రీతిలో ఎగబాకుతున్నాయని ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి పౌరుడు తమ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రులకు విన్నవించే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలకు మంత్రులకు తగిన గౌరవం దక్కడం లేదని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణను కావలసినంత అభివృద్ధి చేసి దక్షిణ తెలంగాణను గాలికొదిలేశారన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించానని అన్నారు. నా హయాంలో చేసిన అభివృద్ధి పనులు నేటికీ సాక్షీభూతంగా నిలుస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే యొక్క అభివృద్ధి పని చేపట్టలేదని విమర్శించారు. శాటిలైట్ పనులు త్వరగా పూర్తిచేసిన ఘనత కాంగ్రెసుకు దక్కుతుందని అన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ, 108, ఫీజ్ రిఎంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్ళు వంటి ఎన్నో ప్రజామోద పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిందని తెలిపారు. వికారాబాద్ లో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్నాయక్ వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ ధరూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి పూడూరు సతీష్ రెడ్డి ఎర్రవల్లి జాఫర్ హనుమంతు ముదిరాజ్ పెండ్యాల అనంతయ్య చాపల శ్రీనివాస్ ముదిరాజ్ జొన్నల రవిశంకర్ తదితర కాంగ్రెస్ ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు.