గుడిసెల పోరాటానికి మద్దతు పలికిన ఐద్వా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఐద్వా ర

Published: Wednesday June 29, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేదీ 28 ప్రజా పాలన ప్రతినిధి.వరంగల్ జిల్లా జక్కలోది గ్రామంలో గత 50 రోజులుగా పేద ప్రజలు అందరూ గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే పోలీసులు తీసివేసి పేద ప్రజల పైన లాఠీఛార్జి చేసి కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈ రోజు రాస్తారోకో చేస్తుంటే, ఐద్వా రాష్ట్ర కోశాధికారి రత్నమాల ను అనేక మంది మహిళలపై లాఠీఛార్జి చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలో ఐద్వా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేసి నిరసన తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా మల్లు లక్ష్మి  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నిరుపేదలు, గుడిసెలు వేసుకుంటే లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం అనేది తెలంగాణలో  నిరంకుశ పాలన కొనసాగుతుందని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో రంగారెడ్డి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ , వృత్తి సంఘాల నాయకులు, పగడాల యాదయ్య , సిఐటియు జిల్లా నాయకులు తీర్పు నరసింహ  మునిందర్ రెడ్డి సర్వయ్య, సౌజన్య, బహుజన సమాజ్వాది పార్టీ  నల్ల ప్రభాకర్ , వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.