ఉపాధి కూలీలకు శానిటైజర్ మాస్క్ పంపిణీ సర్పంచ్ పెంతమల్ల పుళ్ళమ్మ

Published: Thursday May 20, 2021
పాలేరు మే 19 ( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కరోనా భూతం ను తరిమికొట్టాలని కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ పిలుపునిచ్చారు. మండలంలోని కోనాయిగూడెం లో ఉపాధి హమీ పధకం కూలీలకు శానిటైజర్, మాస్క్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ను పంపిణీ చేశారు. అనంతరం పంచాయతీ సిబ్బంది కి గ్లాజులు, శానిటైజర్, మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహ్మరి ని అంతమెందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా ను తరిమికొట్టాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ధైర్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్లమూడి, నర్సయ్య, కార్యదర్శి బోళ్ల వీరబాబు, అంగన్వాడీ టీచర్ వడ్లమూడి నాగమణి, ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి, పంచాయతీ సిబ్బంది బొడ్డు ఆంజనేయులు, కస్తాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.