అంబెడ్కర్ 65వ వర్ధంతి వేడుకలు

Published: Tuesday December 07, 2021
జగిత్యాల, డిసెంబర్ 06 (ప్రజాపాలన. ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో డా: బి.ఆర్ అంబెడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ డా: బీ.ఆర్. అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం దళిత గిరిజనులకు ఓటు హక్కు కల్పించిన మేధావి అని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కోనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దుమాల రాజ్ కుమార్ బండ శంకర్ తాటిపర్తి దేవేందర్ రెడ్డి కొత్త మోహన్ గాజుల రాజేందర్ గిరి నాగభూషణ్ నక్క జీవన్ కల్లెపల్లి దుర్గయ్య దరూరి రమేష్ బోనగిరి దేవయ్య దుమాల గంగారాం ఏనుగందుల మోహన్ బెజ్జంకి సతీష్ బొల్లి శేఖర్ మ్యాకల పవన్ తదితరులు పాల్గొన్నారు.