కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సైదా నాయక్

Published: Tuesday February 07, 2023

బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజా పాలన ప్రతినిధి :ప్రజలు కంటి చూపు బారిన పడి నిర్లక్ష్యం చేయకుండా కంటి వెలుగు శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ గౌడ్, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ లు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం మండల కేంద్రమైన బోనకల్ లోని స్థానిక రైతు వేదిక నందు వారు ఎంపీడీఓ బోడెపూడి వేణుమాధవ్ తో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నయనా నందకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బోడెపూడి వేణుమాధవ్, ఎంపీఓ వెంకట సుబ్రహ్మణ్య శాస్ట్రీ, కంటి వెలుగు వైద్యులు సాయి ప్రియాంక, శిరీష, సిహెచ్ఓ శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శులు దామల్ల కిరణ్, బంధం అర్జున్, స్నేహంజలి మండల సమాఖ్య ఎపీఎం పద్మలత, హెల్త్ సూపర్వైజర్ స్వర్ణమార్త, అఫ్తానాలజిస్టు లెనిన్, ఎఎన్ఎం లు శోభ, హేమలత, వాణి, ఆశా కార్యకర్తలు తులసీ, విజయలక్ష్మి, దుర్గ, లీలాకుమారి, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.