బర్డ్ వాక్ లో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి

Published: Monday February 20, 2023
జన్నారం, ఫిబ్రవరి 19 ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీ అధికారులు నిర్వహిస్తున్న బర్డ్ వాక్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం మండలంలోని ఇందన్ పల్లి రేంజ్ పరిధిలో గనిశెట్టి కుంట వద్ద పక్షి ప్రేమికులతో కెమెరాలలో పక్షులను చూస్తూ వారికి కెమెరాలు పక్షులను బంధించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాధవరావు మాట్లాడుతూ మండలంలోని కవ్వాల్ అటవీ జోన్ పరిధిలో రెండు రోజులుగా బర్డ్ వాక్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బర్డ్ బాగ్ మొదటిరోజు 75 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నరని ఆయన తెలిపారు. జన్నారం అటవీ రేంజ్ లోని పరిధిలోని బైసన్ గుంట గుండు అటవీ ప్రాంతాల్లో పక్షులను పక్షి ప్రేమికులు వీక్షించి వాటిని తమ కెమెరాలోకి తీసుకున్నారు. కవ్వాల్ అటవీ ప్రాంతం తిలకించడం పక్షి ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. పక్షి ప్రేమికులు వారి కెమెరాల్లో కొత్త కొత్త పక్షులను బంధించి ఆప్లాకాన్ని పొందుతామన్నారు. మండలంలోని కవ్వాల్ అటవీ రేంజ్ పరిధిలో రెండో విడత బర్జ్ వాక్ పక్షి ప్రేమికుల కోసం అన్ని ఏర్పట్లు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్నారం, ఇందనపల్లి, తాళ్ల పేట్ రేంజ్ అటవీ అధికారులు, పక్షి ప్రేమికులు, ఇతరులు పాల్గొన్నారు