సాయి చంద్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం జాతీయ మాలమహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు

Published: Friday September 23, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం.
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా   జోగులంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కారుడు, తన ఆట-పాటలతో  ఉద్యమానికి ఊపిరూదిన ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్‌పై స్థానిక ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ గుండాలతో కలిసి దారుణంగా దాడి చేయడం హేయమని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లి రవి వర్మ మాట్లాడుతూ "తెలంగాణ మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తన ఆటా-పాటలతో ప్రపంచ వేదికల మీద గళమెత్తి నినదించిన నిఖార్సైన ఉద్యమకారుడు, కవి, గాయకుడు సాయి చంద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క స్వీయ అస్తిత్వాన్ని యావత్తు దేశానికి చాటి చెప్పేలా రచనలు చేస్తూ, పాటలతో తెలంగాణ ఔనత్యాన్ని పెంచుతున్న సాయి చంద్ పోరాట పటిమ, త్యాగాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థకు చైర్మన్ గా నియమించారు. అలాంటి వ్యక్తిపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ గుండాలతో కలిసి  సాయిచంద్ పై దాడి చేయడం దుర్మార్గం, ఇది హేయమైన చర్య, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాయి చంద్ ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం దారుణం. ఎమ్మెల్యే అబ్రహం మరియు అతని కుమారుడు అజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే తక్షణమే సాయి చంద్ కు క్షమాపణలు చెప్పాలి. ఈ కార్యక్రమంలో పుట్టి శ్రీను శేషమ్మ  వంశీ, తిరుపతయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు...
 
 
 
Attachments area