ఎన్నేపల్లిలో ఈశ ఆసుపత్రి ప్రారంభం

Published: Friday April 14, 2023
* అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్య చికిత్స
* 24 గంటల పనిదినాలతో అందుబాటులో వైద్యులు
* ఆపత్కాలంలో అంబులెన్సులు
* ఈశ ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
* వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజా పాలన : అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్య చికిత్స అందుబాటులో ఉంటే ఏ రోగికి కూడా ప్రాణాపాయం కలుగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జగ్గరి రత్నారెడ్డి తనయుడు డాక్టర్ జగ్గరి భరత్ రెడ్డి కోడలు డాక్టర్ సుస్మితా రెడ్డి ధారూర్ మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి ధారూర్ మండల జడ్పీటీసీ కోస్నం సుజాత వేణుగోపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఈషా ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సను అందుబాటులో ఉండే ధరలకు అందించగలిగితే కలకాలం పేరు ప్రఖ్యాతులు ఈశా ఆసుపత్రి గడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల వైద్య చికిత్సలు నైపుణ్యముతో అందించగలిగితే ఆసుపత్రి కల్పవృక్షములా ఎదుగుతుందని అన్నారు. రోగుల కన్నీటి బాధను వైద్య నిపుణులు తీర్చగలిగితే వారి ఆనందానికి అవధులు ఉండవని కొనియాడారు. ప్రతి వైద్య చికిత్సకు చాంతాంత బిల్లులు వేయకుండా పేదలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య బిల్లులు వేయగలరని సూచించారు. వైద్యో నారాయణ హరిః వైద్యుడు భగవంతునితో సమానంగా రోగులు చూసే విధంగా మసులుకోవాలని హితవు పలికారు. 24 గంటల పాటు వైద్య చికిత్స అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదాల బారిన పడ్డ రోగులను ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈషా ఆసుపత్రిలో అనుభవము గల వైద్య నిపుణులు ఉండాలని కోరారు. పేద ప్రజలకు కొండంత భరోసానిచ్చే ఈశా ఆసుపత్రి ఉన్నదని ప్రజలు నమ్మే విధంగా పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి రోగికి మంచి వైద్యం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈషా ఆసుపత్రికి వెళితే తప్పకుండా రోగం నయమవుతుందని రోగులు విశ్వసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జగ్గరి వెంకటరెడ్డి సంబంధిత వైద్యశాఖ అధికారులు బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.