సాధికారత కోసం మహిళలు ఉద్యమించాలి

Published: Tuesday March 09, 2021
మధిర, మార్చి 08, ప్రజాపాలన ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు షేక్ హసీనా బేగం అధ్యక్షతన యూటిఎఫ్ మధిర డివిజన్ కార్యాలయంలో జరిగిన మహిళా చైతన్య సదస్సుల ఆమె మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణలో మహిళాభివృద్ది కోసం చేసింది శూన్యం అన్నారు.  సినిమాలు, సామాజిక మాధ్యమాలు స్ర్రీలను అంగట్లో ఆటవస్తువుగా చూపిస్తున్నాయని, దీని వల్ల సమాజంలో బాలలు, మహిళలు, వృద్ధులపై అత్యాచారాలు జరుగుచున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుచూనే ఉన్నాయని.. ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించి నేరస్తులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. స్త్రీలు అర్ధరాత్రి స్వేచ్ఛగా సమాజంలో తిరగగలిగినప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మాగాంధీ ప్రభోదించిన సూత్రాన్ని అనుసరిస్తూ పోరాడాల్సిన అవసరం ఉందని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్ది అందించాల్సిన బాధ్యత  మహిళలపై ఉందని, ఆ దిశగా పోరాటం చేస్తూ మహిళ సాధికారత కోసం కృషి చేయాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శీలం విద్యా లత, ఐద్వా నాయకురాలు శ్రీమతి ఫణీంద్ర కుమారి,మండల కార్యదర్శి M. కళావతి, యుటిఎఫ్ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు, సీనియర్ నాయకులు తాళ్లూరి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి ఆర్. లక్ష్మణరావు, చిలుకూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి నిడమానూరు సంధ్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ వినోద్ రావు, షేక్ నాగూర్ వలి మండల బాధ్యులు భీమ శంకర రావు, లాల్అహ్మద్, ఇబ్రహీం, వీరయ్య, D.రమేష్, కొండలరావు, R.రమేష్ మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.