*మానవత్వం చాటిన అవినాష్ రెడ్డి* *రాజు చికిత్సకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం*

Published: Wednesday January 04, 2023
 *గిఫ్ట్ ఏ స్మైల్ కింద చికిత్స కోసం ప్రకటించిన జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* 
 
 *ప్రజాపాలన షాబాద్:::--* జెడ్ పి టి సి పట్నం అవినాష్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం గల అవినాష్ రెడ్డి షాబాద్ కు చెందిన దివ్యాంగ బాలుడు
 రాజు(3) ఆరోగ్య పరిస్థితి పై చెల్లించి పోయారు.
 పుట్టుకతోనే తలలో దీర్ఘకాలిక వ్యాధి తో బాధపడుతున్న మూడేళ్ల రాజు కు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. *రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ స్మైల్ కింద రాజు కు వైద్యం కోసం తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు*.
 షాబాద్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద, దళిత దంపతులు నవనీత సామ్యూల్ లకు మూడేళ్ల క్రితం రాజు జన్మించాడు. పుట్టుకతోనే తలలో ఎముకలు కలిసిన పరిస్థితులతో, అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. నెలకు ఐదు ఆరువేల రూపాయలు అప్పుసప్పుచేసి వారు కొడుకును ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి సలహాతో నవనీత మంగళవారం జడ్పిసి పట్నం అవిరాజ్ రెడ్డిని కలిసి రాజు పరిస్థితి వివరించారు. మూడేళ్లుగా మంచానికే పరిమితమైన రాజు దీనస్థితిని గురించి చెప్పారు. ఆపరేషన్ చేస్తే తప్ప రాజు ఆరోగ్య పరిస్థితి బాగు కాదన్న వైద్యుల నివేదికలను వివరిస్తూ, అందుకు లక్షల్లో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. నిరుపేదలైన వారు డబ్బులు లేక తమ బిడ్డను కాపాడుకోవడం కోసం తపిస్తున్న వైనాన్ని చూసి చెల్లించి పోయిన అవినాష్ రెడ్డి వెంటనే వారికి రాజు *వైద్యం కోసం లక్ష రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు*. మెరుగైన వైద్యం కోసం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి లేదా నిమ్స్ కు అందరి సహకారంతో పంపించి చికిత్స చేయిస్తామని నవనీత, వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో నవనీత తనకు అందుతున్న సహాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డికి సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు రాందేవ్ యాదవ్ తదితరులు ఉన్నారు.