పెంచిన గ్యాస్, చమురు ధరలు తగ్గించాలి

Published: Saturday March 26, 2022
నస్పూర్, మార్చి 25, ప్రజాపాలన ప్రతినిధి: పెంచిన గ్యాస్, చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, దిష్టి బొమ్మ దహనం చేశారు. శుక్రవారం నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్, చమురు ధరలు పెంచుతూ సమాన్యులపై ఆర్థిక భారం మోపుతుందని అన్నారు.  బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న సహజ సంపదలను ప్రభుత్వ రంగ పరిశ్రమలను కొద్ది మంది పెట్టుబడిదారులకు దాసోహం చేసేందుకే కంకణం కట్టుకొని పని చేస్తోందన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను రిలయన్స్ సంస్థకు కట్టబెదుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం కంటే కార్పోరేట్ కంపెనీల కోసమే పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, కారుకూరి నగేష్, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, సన్నీ గౌడ్ . మొగిలి లక్ష్మణ్, లచ్చిరెడ్డి, కోడి వెంకటేశం, సారంగపాణి, శాఖ పురం కిరణ్ కుమార్, సంతోష్, రావుల రాజయ్య, శంకరయ్య ఉయ్యాల శంకర్, హరీష్. నవీన్ కురుమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.