స్వీయ నియంత్రణను పాటించండి

Published: Wednesday May 05, 2021
అవసరం అయితే తప్పా బైటికి రాకండి 
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ 
వికారాబాద్ మే 04 ప్రజాపాలన బ్యూరో : దేశ వ్యాప్తంగా కరోనా విరుచుకు పడుతున్న సమయంలో అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మాస్క్ లేనిదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరాదని సూచించారు. మీ కుటుంబ సభ్యులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. వివాహాలు శుభకార్యాల సీజన్ మొదలు కానున్న దృష్ట్యా వచ్చే 4 వారాలు కీలకం అని వైద్య శాఖ హెచ్చరిస్తున్నదని గుర్తు చేశారు. పేద ప్రజల ఇండ్లు చిన్నగా ఉంటాయి ఒకే రూమ్ తో ఉంటాయి కాబట్టి ఎవరికైనా కుటుంబంలోని ఒక వ్యక్తికీ కరోనా సోకితే మిగతా కుటుంబమంతా  వ్యాపిస్తుందని హెచ్చరించారు. దయచేసి మీ గ్రామంలో మీ కాలనిలో ఉన్న ప్రభుత్వ బిల్డింగులు, డ్వాక్రా సంఘాల భవనాలను పాఠశాల భవనాలలో ఐసోలెట్ అవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గ్రామా సర్పంచ్ బాధ్యత తీసుకోవాలని కోరారు. దేశంలో, రాష్టంలో కరోనా విజృంభిస్తున్న  సందర్భంగా హెల్తత్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక నెల పాటు సంపూర్ణ లక్డౌన్ ప్రకటించాలని పేర్కొన్నారు.