పోరాటం తో వచ్చిన భూమి ప్రజలకు పంచాలి : డేరంగుల నరసింహ

Published: Monday July 19, 2021
రంగారెడ్డి, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పోల్కంపల్లి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో గతంలో పోరాటం చేసిన భూమిలో ప్రజలు చదును చేశారు. 20 ఏండ్ల క్రితం సీపీఎం పార్టీ నాయకత్వంలో గ్రామంలో 60 ఎకరాల భూమిని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచ్చారు. సర్వే నెం 154 లో 8 ఎకరాల్లో భూమిని పేదలు దున్ని పంటవేసుకొన్నారు. దింట్లో 3 ఎకరాలు పోరాటపటిమ ల వల్ల వచ్చిన భూమిని సాదించారు. మరో సర్వే నెం 176 లో 3 ఎకరాల భూమిని అప్పట్లో సీపీఎం పార్టీ నాయకులు గా ఉన్న దేరంగుల నర్సింహ పైన భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు సీపీఎం నుండి trs లో కి వెళ్లిన పోయిన నర్సింహ భూమి పేదలకు ఇవ్వడంలో మొండివైఖరి అవలంబిస్తున్నారు. సీపీఎం పార్టీ మొత్తం6 ఎకరాల భూమిని పంచుతామని చెప్పిన నర్సింహ నా భూమి అని అంటున్నారు. ఈ కమ్యూనిస్టులు సాధించిపెట్టిన భూమిని పంచకపోతే తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చేరి పెళ్లి సీతారాములు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సమేల్, ఆమని గంటివెంకటేష్, సీపీఎం మండలం కార్యదర్శి జంగయ్యా చెరుకూరి నర్సింహ. గూడెంఅశోక్. పంది వెంకటేష్. చెరుకూరి ఆనంద్. కంబాల పెళ్లిఇస్తారి. ఎండి ఉస్మాన్. వై బాలయ్య. పంది యాదయ్య. దన్ ఈశ్వర్. మల్లేష్  దొండ పుష్పమ్మ. చెరుకూరి కమలమ్మ. తదితరులు పాల్గొన్నారు