సర్పంచులకు ఇచ్చినవాగ్దానాలు ఫుల్ నిధులు నిల్ మాయమాటలతో పప్పం కడుపుకుంటున్న తెలంగాణ ప్రభుత

Published: Monday February 27, 2023

చిన్న చిన్న గూడెలు, మారుమూల గ్రామాలు, తండాలు కొత్త పంచాయతీలుగా ఏర్పడి నాయి.. ఎనామస్ అయిన గ్రామపంచాయతీకి 10 లక్షలు రూపాయలు ఇస్తాం అని చెప్పి.. 500 లోపు జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ఎనిమిది లక్షలు అని.. ఊరుకో పంచాయతి బిల్డింగ్ అని.. మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలు తుంగలో తొక్కేసింది... గత ప్రభుత్వాలు ఇంటి పన్ను, నీటి పన్నులు గ్రామ ప్రజలు సరిగ్గా చెల్లించక పోయిన పట్టించుకునేవీ కావు... కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సామాన్యుడి దగ్గర ఇంటి పన్ను, నీటి పన్ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.. గత ప్రభుత్వం లో ప్రజలు వీధి లైట్లకు బిల్లులు కట్టే వారే కాదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం గ్రామ ప్రజల నుండి ముక్కు పిండి మరి వీధిలైట్ల బిల్లులు వసూలు చేస్తుంది.. గ్రామాలు అభివృద్ధి చేయకపోయినా అభివృద్ధి కాకపోయినా పర్వాలేదు కానీ వీధిలైట్ల బిల్లు తప్పని సరిగా కట్టాలని సెక్రటరీ ఒత్తిడి చేసి సర్పంచికి సంబంధం లేకుండా చెక్కులు కొట్టించుకుంటున్నారు.. కొంతమంది సర్పంచులు ఈ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఏ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని గొప్పలు చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం వసూలు చేసిన విధంగా ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి లైట్లు బిల్లులు ఎవరైనా వసూలు చేశారా?