డివిజన్ లో కోటి పది లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజీ పనులు

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : భారీ వర్షాల వల్ల వరద ముంపు ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 2 మున్సిపాలిటీల (జల్ పల్లి, బడంగ్ పేట్) మధ్యలో శాశ్వత పరిష్కారం కోసం సమయం పట్టవచ్చని మంత్రి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ ఆధ్వర్యంలో కోటి పది లక్షల రూపాయలతో పలు కాలనీలో వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కొరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రజా ప్రతినిధులు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ లోని వరద ముంపు ప్రాంతాలు సి.పి న్ ఆర్ కాలనీ నుండి సీత  ఎంక్లేవ్ నక్షత్ర, రఘు హోమ్స్, మెగా డ్రీమ్ సిటీ, మెట్రో సిటీ, నాభిల్ కాలనీ, గ్రీన్ సిటీ అభివృద్ధి డ్రైనేజీ పనులు జరుగుతాయని తెలిపారు. పలు కాలనీలు శాశ్వత అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, క జలపల్లి మున్సిపాలిటీ  కౌన్సిలర్లు, బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బండారు మనోహర్, ఎర్ర మహేశ్వరి జైహింద్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమిడి రామ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.