పల్లెప్రగతి కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర

Published: Friday June 17, 2022
జిల్లాలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృసి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, గ్రామాలలో రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల ముందు మురికి కాలువలలో చెత్తా, చెదారం వేస్తున్న వారిని ఉపేక్షించరాదని, జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు వరున క్రమంలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పల్లెప్రకృతి వనాలలో మొక్కలను సంరక్షించాలని, చనిపోయిన వాటి స్థానంలో పెద్ద మొక్కలను నాటాలని, సమయానికి నీటిని అందించాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్దం చేయాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area