సమకాలీన తెలంగాణ మహనీయులు

Published: Saturday May 22, 2021
1. ఆధునిక చరిత్ర ఒక మహా ప్రవాహం. దాన్ని నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్, కాళేశ్వరం వంటి ఏ ఒక్క ప్రాజెక్లు లోనో ఒడిసి పట్టలేము. అందులో చరిత్ర కెక్కేది ఏ కొంచమో! కను మరగయి పోయేదే ఎన్నో రెట్లు . 
2. యసమ కాలీన సామాన్యులు స్వయం కృషితో మహనీయులుగా, సంఘ సంస్కర్తలుగా, సమాజ సేవకులుగా ఎందరో ఎదిగారు. వారి జీవితాలు చరిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. నాయకత్వం కూడ అందించాయి. వేగవంతమైన చరిత్ర లో నీళ్లలోని చేపల్లా తళుకులీను తుంటాయి. పది మందిలో ఒకరుగా స్పూర్తి నిస్తుంటాయి. అలాంటి వారి జీవిత పరిచయాలు బతికి ఉన్నపుడే అక్షరం బద్దం చేయడం అవసరం.
3. స్వాతంత్ర వజ్రోత్సవ సందర్భంగా తొలి విడతగా 75 మంది గురించి ఒక సంకలనం తేవాలనేది ఒక ప్రణాళిక. 
4. 60 ఏండ్లు పై బడిన సమకాలీన మహనీయుల గురించిన సమాచారం, కృషి, గురించి మీరు ప్రతి పాదించండి. వారి గురించి నాలుగు మాటలు రాయండి. మిగతా విరాలు నిపుణులు, జర్నలిస్టులు సేకరించి రాస్తారు. 
5. మీరే రాయ గలిగేదైతే మరింత సంతోషం. తమ గురించి స్వీయ చరిత్ర రాసినా, రాయించినా ఇంకా సంతోషం. మీ స్వీయ చరిత్ర అన్వేషణ చరిత్రను వెలికి తీస్తుంది.  
6. ఈ కోవలోకి వస్తే మీ గురించి, మీకు తెలిసినవారి గురించి, స్పూర్తి నిచ్చినవారి గురించి మాకు గుర్తు చేసి ఈ కృషిలో భాగస్వాములు కావాలని ఆహ్నానిస్తున్నాము.  
7. 1995-96 నుండి 2014 దాకా సాగిన మలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తమవంతు పాత్ర నిర్వహించిన సామాన్యులకు, మధ్య తరగతికి, సామాన్యులు అసమాన్యులుగా ఎదిగిన వారికే ఇది పరిమితమని గుర్తుంచుకోగలరు. 
8. హైదరాబాద్ నగరంతో పాటు, 33 జిల్లాలలో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కృషి చేసిన వారు ఇందులో చోటు ఉండాలని లక్ష్యం. 
9. ఈ పరిధిలోకి వచ్చే మహిళల కోసం ప్రత్యేక సంకలనం అవసరం. 
10. తరువాతి సంకలనాల కోసం 50 ఏండ్లు పై బడిన వారు, విద్యార్థి యువ నాయకులు కూడ రెడీగా ఇపుడే నోట్సు రాసుకోవడం ప్రారంభిస్తే మంచిది. మీ సూచనలు అభి ప్రాయాలకై నిరీక్షిస్తూ..... విశాల సాహిత్య అకాడమీ. హైదరాబాద్.
 
ఫోన్. 70937 12181 . 83319 66987. 
విశాల సాహిత్య అకాడమీ. 201, సలేఖ గోల్డెన్ టవర్స్. 2-2-186/53/5. రామకృష్ణ నగర్. బాగ్ అంబర్ పేట. హైదరాబాద్- 500013.