కొంశెట్ పల్లి గ్రామం ఆకస్మిక తనిఖీ

Published: Thursday November 18, 2021
ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 17 నవంబర్ ప్రజాపాలన : గ్రామ పంచాయతీకి చెందిన 34 రిజిష్టర్లు, ఉపాధి హామీ పనులకు సంబంధించి 7 రిజిష్టర్లను తనిఖీ చేశామని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలో గల కొంశెట్ పల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి పనుల రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ క్యాష్ బుక్, జనన మరణాల రిజిష్టర్లను వెంట వెంటనే అప్ డేట్ చేయాలని కార్యదర్శి అనితకు సూచించారు. లేబర్ రిపోర్ట్ బుధవారం ఎంత మందికి ఉపాది కల్పించారని అడిగి తెలుసుకున్నారు. 31 మంది ఎంఎల్ ఏపిలో చేస్తున్నారని కార్యదర్శి అనిత తెలిపిందన్నారు. 30 మంది ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలని లేని ఎడల చర్య తీసుకొనబడునని హెచ్చరించారు. పెన్షన్లు ఎంత మందికి ఇస్తున్నారని తెలుసుకున్నారు. 33 మంది ఉన్నారని వారి ఫింగర్ ప్రింట్ రావడం లేదని కొంత మంది నడవడానికి  లేవలేని పరిస్థితిలో ఉన్నారని నాగలత తెలిపారు.  ఆధార్ మీ సేవలో ఫింగర్ ప్రింట్ ఇచ్చి బ్రేడ్ రైజర్ తగ్గించాలని సూచించారు. ఫింగరు ప్రింట్ తోనే ఇవ్వాలని ఎంపీడీఓ వెంకట్ రాం గౌడ్ కార్యదర్శిని నాగలత ని అదేశించామని పేర్కొన్నారు. లేవలేని స్థితిలో ఉన్నవారికి కార్యదర్శి పోస్ట్ డీపీఎం  ఇంటికి వెళ్లిపంపిణీ చేయాలని తెలిపారు. తదుపరి క్రిమిటోరియం దగ్గర ట్యాంక్ ఫిట్ చేసి  వాటర్ ఉండే విధంగా చూడాలని  సెరిగేషన్ గేషన్ షెడ్ మరియు, నర్సరీ విజిట్ చేయనైనదని స్పష్టం చేశారు. నర్సరీలో ఈ సంవత్సరం మొక్కలు పెంచుటకు బ్యాగులు రెడీ చేసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలకు నీరు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిత, డిపిఎం నాగలత పాల్గున్నారు.