పామాయిల్ గెలల దిగుమతిలో ఆయిల్ ఫెడ్ నిర్లక్ష్యం ఇబ్బందులు పడుతున్న రైతులు సత్వరమే పరిష్కరి

Published: Saturday August 20, 2022
అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) అశ్వారావుపేట : రైతాంగం కష్టపడి పండించిన పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తీసుకువస్తే దిగుమతి చేయటానికి రోజులు తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఆయిల్ ఫెడ్ వారు తక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఇబ్బందులు లేకుండా సత్వరమే దిగుమతి చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంగం సభ్యులు. కొక్కెరపాటి పుల్లయ్య, ప్రభుత్వానికి విజ్ఞప్తి . చేశారు.వర్షాలు, పామ్ ఆయిల్ ధరల మూలంగా రైతులందరూ ఒకేసారి పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తరలించడం వలన సుమారు రెండు మూడు వందల ట్రాక్టర్లు నిత్యం దిగుమతి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. సుమారు ట్రాక్టర్ కు 5 టన్నులు ఫ్రూటు వస్తుందని, ఫ్యాక్టరీలో ప్లాట్ ఫామ్ సామర్థ్యం కూడా లేకపోవడం వల్ల దిగుమతి చేసుకోవడం లేదని, గంటకు 30 టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఫ్రూటు ఎక్కువగా రావడం వలన రోజులకొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, మండలంలో ఎక్కువగా సన్నా చిన్నకారు రైతులు కావడం వల్ల ట్రాక్టర్లు అద్దెకు తీసుకొని పామాయిల్ గెలలు తరలిస్తున్నారని, దీంతో రైతుకు అదనంగా భారం పడుతుందని, పామాయిల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో వాహన డ్రైవర్లు ఉండేందుకు కనీస వసతులు లేవని, మంచినీళ్లు గాని, క్యాంటీన్ సౌకర్యం కానీ లేవని ఈ సమస్యలపై గత మూడు సంవత్సరాల నుండి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని, ఎండి డిప్యూటీ ఎండి తదితర అధికారులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని  వారు తెలిపారు. కనీసం ఫ్యాక్టరీలో సుమారు వెయ్యి టన్నులు స్టోరేజీ ఉంటే కొంత సమస్య పరిష్కారం అవుతుందని, అటువంటి వాటికి యాజమాన్యం ఏర్పాటు చేయాలని, ఇప్పటికే 600 టన్నుల ప్లాట్ ఫామ్ నిర్మాణంలో ఉందని, అన్ సీజన్లో చేయవలసిన నిర్మాణాలు సీజన్లో చేయడం వలన  ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సీజన్ రాకముందే యాజమాన్యం ఇటువంటి వాటిపై దృష్టి సారించాలని  వారు సూచించారు. పామాయిల్ గెలల దిగుమతికి వచ్చిన ట్రాక్టర్లను నెంబర్లు ప్రకారం మాత్రమే దిగుమతి చేయించుకోవాలని, రాజకీయ పలుకుబడులకు ఆస్కారం ఉండకూడదని యాజమాన్యానికి సూచించారు. తక్షణమే పామాయిల్ గెలల దిగుమతికి వచ్చిన ట్రాక్టర్లను వెంటనే అన్లోడ్ చేసే విధంగా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతాంగం వ్పామాయిల్ పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారని, సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి  ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.