స్వర్ణకారుల పొట్టకొడుతున్న మార్వాడీ షాపులను నియంత్రించాలి --కందుకూరి కిశోర్ కుమార్

Published: Thursday December 08, 2022
 చౌటుప్పల్ డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి): చేతివృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పొట్టకొడుతున్న మార్వాడీ జ్యూవెల్లరీ షాపులను నియంత్రించి స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకోవాలని విశ్వకర్మ స్వర్ణకార సంఘం చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కందుకూరి కిషోర్ కుమార్ అన్నారు.బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో స్వర్ణకారుల సమస్యలపై ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ చౌటుప్పల్ చుట్టుపక్కల 500 కుటుంబాలు స్వర్ణకార వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారని,మార్వాడీ వాళ్ళు పాన్ బ్రోకర్ షాపులను జ్యూవెల్లరీ షాపులుగా మార్చడం వల్ల రెండునెలల వ్యవధిలో ఐదుగురు స్వర్ణకార కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో మరిన్ని కుటుంబాలకు చావే శరణ్యంగా మారనుందని,వెంటనే మార్వాడీ షాపులను నియంత్రించి చేతివృత్తులను కాపాడాలని కోరడం జరిగింది.10 రోజుల క్రీతం ఇట్టి విషయంపై మెమోరాండం అందజేయడం జరిగిందని తక్షణమే మార్వాడీ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం కార్యదర్శి ముటుకుల్లోజు శ్రవణ్ కుమార్, కోశాధికారి చొల్లేటి లక్ష్మీనారాయణ, కార్యదర్శి కొండోజు సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు దాసోజు సంపూర్ణ చారి, సహాయ కార్యదర్శి కూరెళ్ళ బ్రహ్మచారి, దాసోజు వెంకటాచారి, గోవర్ధన్,
కూరెల్ల రామాచారి,బిక్షమాచారి,మారోజు పాండురంగాచారి,నాగేష్,ప్రదీప్,పాండు,ముమ్మడి శ్రీను,భగవంత చారి,మల్లికార్జున చారి,డి.రాము తదితరులు పాల్గొన్నారు.
 
 
 

One attachment • Scanned by Gmail