ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి

Published: Monday May 31, 2021
పరిగి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ సూచన మేరకు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఆర్టీసీ డిపోలో కారోనో వ్యాక్సిన్ పరిగి తాలూకా యువజన సంఘాల ఉపాధ్యక్షుడు జోగు భాస్కర్ మొదటి డోస్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అదే మాదిరిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వారికి ఆర్టిసి రాష్ట్ర కమిటీ తరఫున ఆర్టీసీలో 49 వేల మంది ఎంప్లాయిస్ ఉన్నారు. ఇందులో దాదాపుగా 25 వేల చిల్లర కార్మికులు ఫస్ట్ డోస్ వేయించుకోవడం జరిగింది ఇక మిగిలిన 25 వేల మందికి ఈ మూడు రోజుల్లో వ్యాక్సిన్ ఇప్పించడం చాలా సంతోషమైన విషయం అన్నారు అదే మాదిరిగా కార్మికుల కుటుంబాలకు కూడా చొరవ తీసుకొని యాక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇంట్లో ఫ్యామిలీ బాగుంటేనే ఒక ఎంప్లాయిస్ ఉంటారు కాబట్టి కార్మికుల ఫ్యామిలీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని జోగు భాస్కర్ కండక్టర్ తెలిపాడు ఈ కార్యక్రమంలో పరిగి సీఐ జనార్దన్, మరియు కండక్టర్ శామ్ నర్సింలు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.