రుణమాఫి ధరిని పోర్టల్ రద్దు చేయాలి రైతు సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన...

Published: Friday November 25, 2022
పాలేరు నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి
తిరునాయిపాలెం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండల కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాజా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫి ధరిని పోర్టల్ రద్దు రైతు సమస్యలపైన నేడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతన్న కోసం కాంగ్రెస్ పోరాటం నిరసన కార్యక్రమం నిర్వహించి, స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
 
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
1) జాబితాలో ఉంచిన ప్రతి గుంటను జాబితా నుంచి తొలగించి గ్రామపంచాయతీ సభలో ఆ గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలి 
2) హయాంలో పేదలకు అసైన్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారులకు ఉండే హక్కును సమానంగా అసైన్డ్ భూములకు కూడా హక్కు కల్పించాలి ఆ విధంగా చట్ట సవరణ చేయాలి 
3) ప్రతి ఏటా రెండు పంట కాలాలకు భూములు కవులు చేసుకునే రైతులకు హక్కు కలిగించే విధంగా గ్రామ స్థాయిలో కవులు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకురావాలి అదేవిధంగా పట్టా భూమి యజమానికి ఏ విధమైన చట్ట పరమైన ఇబ్బందులు రాకుండా చూడాలి
4)2004 లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పాలసినీ అమలు చేయడానికి ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి రాష్ట్ర శాసనసభలో వెంటనే భూమి టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలి
5)రైతులకు 100000 రుణమాఫి చేయాలి 
6) అటవీ భూములు 2006 లో తెచ్చిన అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలి 
 
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయెల్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ జూలకంటి సాగర్ రెడ్డి తిమ్మకపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు పత్తి నాగేశ్వరరావు పిచ్చయ్య  బేరోలు మాజీ సర్పంచ్ రఘురాం రెడ్డి పడమటితండా గ్రామ కాంగ్రెస్ నాయకులు పతన హనుమంతు మల్సూర్  పైనంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్లయ్య పాతర్లపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు తమిర ఉపేందర్ రెడ్డి నేలమర్రి రాములు అచ్చ బాబు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు జి.మోహన్ యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్ నాగుల్ మీరా అజ్మీర మోహన్ అశోక్ నానక భాస్కర్ వీరన్న   కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.....