కరీంనగర్ లో నల్ల జెండాలతో నిరసన కరీంనగర్ జనవరి 05 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం:

Published: Saturday January 07, 2023

ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయకుండా, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని నిరసిస్తూ "ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి" ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సై కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు అభ్యర్థులకు నరకయాతను తలపిస్తున్నాయన్నారు. 1600, 800 మీటర్ల రన్నింగ్ పరీక్షను పాస్ అయినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు అనుమతించాలన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతూ ఎదురుచూసిన అభ్యర్థులకు ప్రస్తుత నిబంధనలు నిరాశన మిగులుస్తున్నాయన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనలను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి మహేందర్, బ్రాహ్మణపెల్లి యుగంధర్, యువజన కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ఏఐఎస్బి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడిపల్లి హేమంత్ కుమార్, బిఎస్ఎఫ్ నాయకుడు బోయిని కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.