బయటకు వెళ్లాలంటే వీధి కుక్కలతో భయం భయం. -రోజురోజుకు ఎక్కువవుతున్న కుక్కల సంతతి.

Published: Saturday October 08, 2022
 చేవెళ్ల, అక్టోబర్ 07.(ప్రజాపాలన)

గ్రామ సింహాల (కుక్కల) బెడద రోజురోజుకీ ఎక్కువైపోతోంది. వీధుల్లోకి రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కుక్కల దాడితో పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. శునకాల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రజలు (అంగడి బజార్ కాలనీ వాసులు) వాపోతున్నారు.
జనాలు కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని వినతులు వస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంటబడుతూ కుక్కలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈకంగారులో వాహనం వేగం పెంచి పలువురు అదుపుతప్పి కిందపడి పోయి గాయాలపాలవుతున్నారు.
కుక్కకాటుతో ర్యాబిస్ వ్యాధి సంక్రమించి నిర్లక్ష్యం చేస్తే మనిషి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. వాటిని నివారించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదే. కుక్కలను చంపరాదు, వాటి సంతతి నివారణకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలి, సంతాన నిరోధక ఇంజెక్షన్లు వేయాలి. వీధి కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు గ్రామస్తులు కోరారు.
 
 
 
Attachments area