వరద ముంపు ప్రాంతాల్లో సి పి ఐ ఎం పర్యాటన

Published: Wednesday August 24, 2022
పి.ఆశన్న 
సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
 
మంచిర్యాల టౌన్, ఆగష్టు 23, ప్రజాపాలన: వరద ముంపు ప్రాంతాల్లో   భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్  రాష్ట్ర కమిటీ బృందం జిల్లా కేంద్రంలోని వరద ప్రాంతాల్లో రాంనగర్, ఎన్టీఆర్ నగర్ లలో మంగళవారం రోజున పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని  పలు కాలనీలు వరదలో నీటిలో మునిగితే  ప్రమాదం నుండి ప్రజలను రక్షించాల్సిన  ప్రభుత్వం. బాధ్యతరహిత్యంగా వ్యవహారించింది. ప్రజలు తమ ఇండ్లను కోల్పోయరు, ప్రతి ఒక్కరు సుమారు 1 లక్ష రూపాయల నుండి 20 లక్షల వరకు నష్టపోయారు.నష్ట పోయిన ప్రజలకు న్యాయం చేయవల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీ,స్థానిక జిల్లా కలెక్టర్ మొక్కుబడిగా సందర్శించి ఎలాంటి సహాయం చేయకపోవడం బాధాకరం అని అన్నారు .ఇన్ని రోజులు గడిచిన ప్రభుత్వం ఒక్కరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు.వెంటనే వరద బాధితులకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల  సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రామలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు సంకే రవి, ప్రకాష్, దుంపల రంజిత్ కుమార్, మహేష్, మోహన్, కుమాస్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.