ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను ఖండించిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు . అశ్వాపురం (

Published: Tuesday November 15, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి. ఆర్. స్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గౌ:శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు.
అటవీశాఖ అధికారుల ఒంటెత్తుపోకడతో సామాన్య ప్రజలకు-రైతులకు తీవ్ర నష్టం దాల్చుతున్న వైనం. 
ఆనందపురం పంచాయతీ-చింతిర్యాల రేంజ్ పరిధిలోని పొడుభూములపై ఫారెస్ట్ అధికారుల తీరు శోచనీయం..
అశ్వాపురం మండలం-ఆనందపురం పంచాయతీ-చింతిర్యాల రేంజ్ పరిధిలోని సర్వే నెంబర్ 151 నందు స్థానిక ప్రజలు-రైతులు ఎన్నోఏళ్లగా సాగుచేసుకుంటున్న పంటపొలాలను ధ్వంసం చేసేవిధంగా రైతుల పంటపొలాల్లోకి గొర్రెలను-మేకలను మేపేలా చర్యలకు పూనుకోవడం స్థానిక రైతులపట్ల చిన్నచూపు చూడటమేనని..ఓ పక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోడుసాగుదారుల పట్ల సమన్వయంతో ముందుకెళ్లాలని చెపుతున్నా-స్థానిక అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం అప్రజాస్వామ్యమని-రైతుల సాగుభూములపై ఇలా దౌర్జన్యాలకు దిగడాన్ని 
ఈ విషయమై స్థానిక బి. ఆర్. స్ పార్టీ నాయకులు అటు అధికారులకు సమాచారం ఇవ్వగా మండల సంబధితశాఖా అధికారులు-గౌరవ మండల మేజిస్ట్రేట్ మరియు ఫారెస్ట్ రేంజ్ అధికారులు సైతం సంబధిత భూముల నిమిత్తం పరిశీలన జరిపి త్వరలోనే తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీమ్, స్థానిక సర్పంచ్ ఊస జ్యోతి, సీనియర్ నాయకులు ఊస అనిల్, మండలం ప్రచార కార్యదర్శి రామకృష్ణ, మండలం  ఎస్సి సెల్ ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము,ప్రసాద్, రాంబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.