లారీ ఓనర్స్ అసోసియేషన్ చేసే పోరాటానికి సిఐటియు మద్దతు ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి ల

Published: Wednesday December 14, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 13 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసే పోరాటానికి సిఐటియు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లూరి లోకేష్ మాట్లాడుతూ జిన్ని మిల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి స్థానిక లారీ ఓనర్లకు పని ఇవ్వాలని, ఆసిఫాబాద్ నుండి గుంటూరుకు  లోడింగ్ ట్రాన్స్పోర్ట్ కింగ్ చార్జీలు రూ 40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిన్ని మిల్లుల యాజమాన్యం  వెంటనే లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకత్వాన్ని చర్చలకు పిలిపించి, ట్రాన్స్పోర్ట్ చార్జీలు  ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిన్నింగ్ మిల్ యాజమాన్యం సమస్యలను పరిష్కరించని ఎడల ఓనర్స్ చేసే పోరాటానికి సిఐటియు జిల్లా కమిటీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని, వాళ్లు చేసే ఆందోళన పోరాటానికి సంపూర్ణ సంఘీభావం ఉంటుందని తెలిపారు