మండల కార్యాలయం ముందు బీజేపీ నేతల ధర్నా

Published: Thursday July 15, 2021
అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ సిబ్బంది
తహసీల్దార్ ను, విఆర్ఏ సస్పెండ్ చెయ్యాలని బీజేపీ నాయకులడిమాండ్

జిన్నారం, జులై 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు జిన్నారం తాహసిల్దార్ దశరథ్, రెవెన్యూ సిబ్బంది కొమ్ముకాస్తున్నారని జిన్నారం మండల బిజెపి పార్టీ నాయకులు, జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బుధవారం జిన్నారం, బొల్లారం కి చెందిన  బిజెపి నాయకులు మండలంలోని ఆయా గ్రామాల రైతులతో కలిసి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాహసిల్దార్ దశరథ్, వీఆర్ఏ వెంకటేష్ పనితీరుకు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతులకు చెందిన వ్యవసాయ భూములను ప్రభుత్వ భూములను తాహసిల్దార్, విఆర్ఏ లు కలిసి అధికార పార్టీకి చెందిన నాయకులకు కట్టబెడుతున్నారని, జిన్నారం బొల్లారం ప్రాంతాలలో చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నయని ఫిర్యాదు చేసిన పట్టించు కోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది అధికారుల తీరు మార్చుకోకపోతే మునుముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతులపై వీఆర్ఏ వెంకటేష్  బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాహసిల్దార్ విఆర్ఏ లను జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న నిరసనకారులను పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్ రెడ్డి, బిజెపి నాయకులు శివసాయి, రాజిరెడ్డి, దుబ్బ శ్రీను, రమేష్, పల్నాటి శ్రీనివాస్, బుక్క బిక్షపతి, సుధాకర్, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.