బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

Published: Wednesday March 17, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఆర్ ఏస్ ప్రవీణ్ కుమార్ హిందూ బందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాదులోని డిజిపి పోలీస్ కార్యాలయం ముట్టడికి వెళ్తారనే క్రమంలో స్థానిక బిజెపి నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీనివాస్, మైసోళ్ల మత్స్యగిరి, డొగిపర్తి సంతోష్, రేగూరి అమరెందర్, దయ్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.