ఘనంగా వాసిరెడ్డి రామనాథం జన్మదిన వేడుకలు

Published: Thursday November 03, 2022
మధిర  నవంబర్ 2 (ప్రజా పాలన ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ప్రజా వైద్యులు వాసిరెడ్డి రామనాథం జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు నాయకులు జెవి రెడ్డి, హరి కిరణ్ కాంత్, గద్దల నాని, గద్దల రాజా, ఆళ్ల నాగబాబు, జగన్నాథ చారి, కొంగర రవి, అవుల రామకృష్ణ తదితరులు ఉన్నారు.